| Daily భారత్
Logo




లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు, రిమాండ్

News

Posted on 2026-05-20 11:06:54

Share: Share


లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు, రిమాండ్

వివరాలు వెల్లడించిన సిరిసిల్ల రూరల్ సి.ఐ నాగేశ్వరరావు.

డైలీ భారత్, తంగళ్ళపల్లి: ఒంగోలు జిల్లా,పోర్సిపాడు మండలం మ్యాదరమెట్ల గ్రామానికి చెందిన చైతన్య మణికంఠ, తండ్రి ఆంజనేయులు,వయసు 21 సం..లు అనే వ్యక్తి ప్రస్తుతం వేములవాడలో,తేలుకుంట ఇంద్రనగర్ గ్రామం (అగ్రహారం)  లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.చైతన్య మణికంఠ కూలి పని వచ్చే డబ్బులు తన యొక్క జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనం చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. 

గతంలో కూడా బోయినపల్లి , జమ్మికుంట ఏరియాలలో దేవాలయాల్లో దొంగతనం చేసి పోలీసు వారికి దొరికి జైలు జీవితం కూడా గడిపాడు.అయినా కూడ చైతన్య మణికంఠ లో ఎలాంటి మార్పు రాకుండా మళ్ళీ  దొంగతనం చేయాలని నిర్ణయనిచుకొని తన దగ్గరి బంధువులైన బోదాసు యాదగిరి, తండ్రి రాములు గ్రామం బస్వాపూర్ మండలం కొహెడ, కొమిరె శ్రీను ,తండ్రి వెంకటయ్య, గ్రామం బద్ది పడగ,మండలం నంగునూరు, వారితో కలిసి ఒక ముఠాగా ఏర్పడి దొంగతనం చేయాలని నిర్ణయించుకొని తేదీ:-21-01-2026 రోజున మధ్యాహ్నం సమయంలో ముగ్గురు ద్విచక్ర వాహనంపై తంగళ్ళపల్లి గ్రామానికి వచ్చి  ఊరిలో ఏదైనా దొంగతనం చేయడానికి రెక్కీ చేయగా, గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం చూసి గుడిలో దొంగతనం చేయాలని ముగ్గురు నిర్ణయించుకుని,మరుసటి రోజున తెల్లవారుజామున ముగ్గురు గుడిపైకి వెళ్లి గుడి పక్కన ఉన్న యాగశాల యొక్క తలుపు తాళం బండరాయితో పగలగొట్టి అందులో ఉన్న పంచలోహ గరుడ వాహనాన్ని తీసుకొని బైకుపై వెళ్ళినారు అని సి.ఐ తెలిపారు

ఆలయ పూజారి తంగళ్ళపల్లి  పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా తంగళ్ళపల్లి ఎస్.ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా,తేదీ: 19-05-2026 రోజున మధ్యాహ్నం ఎస్ఐ ఉపేంద్ర చారి తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, చైతన్య మణికంఠ ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం సిద్ధిపేటకు వెళ్తుండగా పాత నేరస్థుడు కావడంతో అనుమానం వచ్చి విచారించగా,తాను మరో ఇద్దరితో కలసి దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. చైతన్య మణికంఠ ద్విచక్ర వాహనం సీజ్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని,పరారీలో ఉన్న మిగితా ఇద్దరు నిందుతులను త్వరలో పట్టుకుంటమని రిమాండ్ చేస్తామని సి.ఐ తెలిపారు.

నిందుతున్ని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్.ఐ ఉపేంద్ర చారి, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్ సంపత్, శ్రావణ్ లను సి.ఐ అభినందించారు.

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >