Posted on 2026-05-20 09:09:12
సిరిసిల్ల, వేములవాడలలో స్వచ్ఛందంగా మూతపడిన మెడికల్ షాపులు...
డైలీ భారత్, సిరిసిల్ల: ఆన్‌లైన్ మందుల విక్రయాల విధానం ఈ-ఫార్మసీ చిన్న తరహా మెడికల్ వ్యాపారుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో మెడికల్ వ్యాపారులు నిరసన గళమెత్తారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ పట్టణంలో మెడికల్ షాపుల యజమానులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి తమ నిరసన తెలిపారు. ఉదయం నుంచే మెడికల్ షాపుల యజమానులు దుకాణాలను తెరవకుండా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ-ఫార్మసీ విధానం అమల్లోకి వస్తే స్థానికంగా ఉన్న వేలాది చిన్న మెడికల్ షాపులు మూతపడి, లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ సంస్థలు ఇస్తున్న ఆఫర్లతో తాము పోటీ పడలేకపోతున్నామని, దీనివల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని వారు పేర్కొన్నారు. కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా, రోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ-ఫార్మసీ విధానం ప్రమాదకరమని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా నకిలీ మందులు విక్రయించే అవకాశం ఉందని, తద్వారా రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మందుల అమ్మకాల్లో నాణ్యత, నిబంధనల అమలులో ఈ-ఫార్మసీ సంస్థల వల్ల అనేక లోపాలు జరుగుతాయని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాపాడాలని, రోగుల ఆరోగ్య హితం కోరి ఈ-ఫార్మసీ విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని మెడికల్ షాపుల యజమానుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. మెడికల్ షాపులు బంద్ కావడంతో మందుల కోసం వచ్చిన రోగులు ఇబ్బందులు పడ్డారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >