Posted on 2026-05-16 15:25:34
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ క్యాడర్లకు చెందిన 10 మంది సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన రివార్డులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన చేతుల మీదుగా అందజేశారు.మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వారి క్యాడర్ ను బట్టి తెలంగాణ ప్రభుత్వం రివార్డులను ప్రకటించింది.10 మంది సభ్యులకు గాను 55,60,000/-(యాభై ఐదు లక్షలు) రూపాయలను ఎస్పీ చెక్కుల రూపంలో అందజేశారు.ప్రత్యేక చొరవ తీసుకొని లొంగిపోయిన వారందరికి ప్రభుత్వం తరఫున రావాల్సిన రివార్డు నగదును ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు.
రివార్డులను అందుకున్న వారిలో స్టేట్ కమిటీ మెంబెర్ - 01,డివిజనల్ కమిటీ మెంబర్స్ - 01, ఏరియా కమిటీ మెంబెర్స్ - 06, దళ సభ్యులు - 02 లు ఉన్నారు.
ప్రస్తుతం వారి స్థితిగతుల గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.రివార్డులను అందుకున్న సభ్యులకు ఎస్పీ కొన్ని సూచనలను చేశారు.రివార్డుల ద్వారా అందుకున్న నగదును విలాసాలకు ఉపయోగించకుండా,సక్రమ పద్దతిలో జీవనోపాదికి ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేసుకోవాలని సూచించారు.జిల్లా పోలీసులు చేపట్టిన "ఆపరేషన్ చేయూత" కార్యక్రమానికి ఆకర్షితులై లొంగిపోయిన మావోయిస్టులకు జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేసారు.లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసంతో పాటు ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందిస్తున్నామని తెలియజేశారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >