| Daily భారత్
Logo




పోలీసుల కృషితో ఇంటికి చేరిన వృద్ధుడు

News

Posted on 2026-05-15 16:10:30

Share: Share


పోలీసుల కృషితో ఇంటికి చేరిన వృద్ధుడు

డైలీ భారత్, కామారెడ్డి: మతిస్థిమితం కోల్పోయి 24 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబ సభ్యులకు అప్పగించిన కామారెడ్డి పోలీసులు

మానవత్వానికి నిదర్శనంగా కామారెడ్డి టౌన్ పోలీసులు మతిస్థిమితం కోల్పోయి 24 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యుల నుంచి దూరమైన ఓ వృద్ధుడిని గుర్తించి, అతని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.

జోగులాంబ గద్వాల్ జిల్లా, పుటన్‌పల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ (65) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో సుమారు 24 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి కుటుంబ సభ్యులకు కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ వచ్చారు.

గురువారం రాత్రి సాధారణ తనిఖీల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అశోక్ మరియు హోంగార్డ్ రవి కామారెడ్డి పట్టణంలో సత్యనారాయణను గుర్తించి, అతని వద్ద నుంచి పూర్తి వివరాలను సేకరించారు. అనంతరం ఆ సమాచారాన్ని కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌కు అందజేశారు.

కామారెడ్డి పోలీసులు వెంటనే జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీసులను సంప్రదించగా, వారు పుటన్‌పల్లి గ్రామంలో విచారణ జరిపి, సత్యనారాయణ నిజంగానే 24 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తేనని నిర్ధారించారు. అనంతరం ఆయన కుమారులు శివశంకర్ మరియు జ్ఞానచారి (గణేష్)ను కామారెడ్డికి పంపించారు.

శుక్రవారం ఉదయం కామారెడ్డి టౌన్ సీఐ శ్రీ నరహరి సమక్షంలో సత్యనారాయణను ఆయన కుమారులకు అప్పగించారు. తండ్రిని ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్న కుమారులు భావోద్వేగానికి గురై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సేవలో కీలక పాత్ర పోషించిన పోలీస్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ రవి,  పీసీ కమలాకర్ రెడ్డిని, పట్టణ సీఐ నరహరిని జిల్లా ఎస్పీ అభినందించారు.

ప్రజల పట్ల సేవాభావంతో, మానవత్వంతో స్పందిస్తూ కామారెడ్డి పోలీసులు మరోసారి ఆదర్శంగా నిలిచారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >