| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పేకాట స్థావరంపై పోలీస్ మెరుపు దాడి..

పేకాట స్థావరంపై పోలీస్ మెరుపు దాడి..

నలుగురు పేకాటరాయుల్ల అరెస్ట్..

రూ.6500 నగదు, నాలుగు సెల్ ఫోన్ లు సీజ్.

డైలీ భారత్, సూర్యాపేట: చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించిన పోలీసులు.

నమ్మదగిన సమాచారంపై సూర్యాపేట జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మికంగా మెరుపు దాడి చేయడం జరిగింది. రైడ్ నిర్వహించి నలుగురు పేకాటరాయుల్లను అరెస్టు చేసి చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. మరో నలుగురు పోలీసులను చూసి పారిపోయారు. పట్టుబడి చేసిన నలుగురు వ్యక్తుల నుండి సుమారు 6,500 నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి అసాంఘిక చర్యలను ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో ఉపేక్షించేది లేదని ఇలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులకు 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Previous షాద్‌నగర్‌లో దారుణ హత్య కేసు ఛేదన
Next ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తో సత్ఫలితాలు
ADVERTISEMENT