| Daily భారత్
Logo




వయోవృద్ధులకు సహకార ఉపకరణాల పంపిణీ

News

Posted on 2023-09-24 17:43:01

Share: Share


వయోవృద్ధులకు సహకార ఉపకరణాల పంపిణీ

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ ఉన్నత పాఠశాలలో  ఆదివారం  వయావృద్ధులకి సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

  మంత్రి. కే తారక రామారావు  ఆదేశానుసారం 2022 జనవరి నెలలో  జిల్లా కలెక్టర్  అనురాగ్ జయంతి పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అలింకో సంస్థ ద్వారా అన్ని మండలాలలో క్యాంపులు నిర్వహించడం జరిగింది. రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం లో భాగంగా మొత్తం 45 లక్షల రూపాయల విలువ గలిగిన పరికరాలను మన జిల్లాకు మంజూరు చేయడం జరిగింది. వీటిలో మొదటి దశలో 25 లక్షల రూపాయల విలువ గలిగిన వీల్ చైర్లు, చెవిటి మిషన్లు, చేతి కర్రలు, నడుము పట్టీలు, మెడ పట్టీలు మొదలైన వాటిని అందజేయుటకై నేడు  గౌరవ ప్రజాప్రతినిధులు   టెక్స్ టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య  రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య  సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు డాక్టర్ జనపాల శంకరయ్య , సిరిసిల్ల మున్సిపల్   కౌన్సిలర్లు, తంగళ్ళపల్లి మండల అధ్యక్షురాలు మానస  ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షురాలు రేణుక ఇ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు సంజయ్ కోహ్లీ డిప్యూటీ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర న్యాయ సామాజిక సాధికారికత మంత్రిత్వ శాఖ హాజరయినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం చేసిన కృషి వలన ఇది సాధ్యమైందని జిల్లా యంత్రాంగం వయోవృద్ధుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను అభినందించారు అలాగే వయోవృద్ధుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వారందరికీ సరైన వసతులు అందుతున్న విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే హాజరైన టెక్స్టైల్ చైర్మన్ గూడూరు ప్రవీణ్  మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆసరా పెన్షన్లు ఇతర పథకాలు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో అందరికీ గౌరవంగా జీవించేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. అలాగే అడిషనల్ కలెక్టర్  గౌతమ్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరూ లబ్ధిదారులు వారి వారి పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ఈ శిబిరానికి హాజరై  ఎంపిక కాబడిన సిరిసిల్ల ,తంగళ్ళపల్లి ఎల్లారెడ్డిపేట, మండలాల వయోవృద్ధులకు పరికరాలు అందించడం జరిగింది.  ఈ సందర్భంగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి  కే తారక రామారావు , ఎంపీ బండి సంజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఇంకా ఎవరైనా లబ్ధిదారులు పరికరాలు తీసుకోనట్లయితే సఖి కేంద్రంలో కానీ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో గాని తీసుకోవచ్చు .అలాగే మిగతా మండలాలకు రెండు మూడు రోజుల్లో అన్ని పరికరాలు పంపించబడతాయి, అక్కడ సంబంధిత మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు  ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో పంపిణీ చేయబడతాయి. 


 అలాగే ఈ కార్యక్రమానికి  నాగరాజ్ గౌడ్ , వెల్దండ దేవదాసు  కౌన్సిలర్లు, సీడీపీఓలు సుచరిత, ఎల్లయ్య , దివ్య మరియు అన్ని సెక్టార్ల సూపర్వైజర్లు, సఖి కోఆర్డినేటర్ పద్మ, పోషన్ అభియాన్ కోఆర్డినేటర్ బాలకృష్ణ,ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ సంతోష్, సీనియర్ అసిస్టెంట్లు సంతోష్, శోభన, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్వర్ణలత, చైల్డ్ లైన్ ఇన్చార్జి కోఆర్డినేటర్ పరమేశ్వర్,  ఆలింకో ఫీల్డ్ ఆఫీసర్ రామాంజనేయులు మరియు వారి సిబ్బంది, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >