| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యువకుడి అనుమానాస్పద మృతి: ప్రియురాలు పరార్!

యువకుడి అనుమానాస్పద మృతి: ప్రియురాలు పరార్!

బెంగళూరులో యువకుడి అనుమానాస్పద మృతి: ప్రియురాలు పరార్!

డైలీ భారత్, బెంగళూరు: ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఓ వివాహిత.. అతడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వెంటనే పరారైన ఘటన బెంగళూరు శ్రీగంధనగరలో కలకలం రేపింది. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి (28), వివాహిత ప్రియాంక అద్దె ఇంట్లో భార్యాభర్తలుగా చలామణి అవుతున్నారు. అయితే, తనను వదిలేయాలంటూ ప్రియాంక ఒత్తిడి చేస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తిప్పేస్వామి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా, పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. తిప్పేస్వామి మృతి చెందిన వెంటనే ప్రియాంక పరారీలో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు.

Previous పెళ్లి పేరుతో వంచన... దేవస్థానం ఉద్యోగిపై కేసు నమోదు.?
Next కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ADVERTISEMENT