| Daily భారత్
Logo




ఎంపీ వద్దిరాజు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి

News

Posted on 2026-05-10 04:54:05

Share: Share


ఎంపీ వద్దిరాజు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించడంతో పాటు తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు.ప్రధాని ఆదివారం హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా ఎంపీ రవిచంద్ర శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ నిధులు విడుదల  చేయాల్సిందిగా,బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం తెల్పాల్సిందిగా, ఖాజీపేటలో రైల్వే మానిఫ్యాక్చరింగ్ యూనిట్ కాకుండా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు పచ్చజెండా ఊపాల్సిందిగా ఎంపీ రవిచంద్ర ప్రధానమంత్రి మోడీని కోరారు.అదేవిధంగా తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)నెలకొల్పాలని, గిరిజన యూనివర్సిటీకి మరిన్ని నిధులు విడుదల చేయాలని,మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణపు పనులను మరింత వేగవంతం చేయాలని ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని ఆయన కోరారు. భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)రైల్వేస్టేషన్ ఏర్పాటై 2032 నాటికి 100 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా డివిజన్ ఏర్పర్చాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీకి ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా జవహర్ నవోదయ పాఠశాలలు కేవలం 16 మాత్రమే ఉన్నాయని,జిల్లాకొకటి చొప్పున మరో 17,రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 సైనిక్ స్కూల్స్ మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరారు.ప్రజల కోరిక మేరకు భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిన అవసరాన్ని తన ప్రకటన ద్వారా ఎంపీ రవిచంద్ర ప్రధాని మోడీ దృష్టికి తెచ్చారు.అలాగే,జనగణన సందర్భంగా కులగణన చేపట్టాలని,చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్లతో పాటుగా అమలు చేయాల్సిందిగా  ప్రధానమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.ఓబీసీల సంక్షేమం, అభ్యున్నతికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >