| Daily భారత్
Logo




డబ్బు కోసం క్లాస్‌మేట్‌ కిడ్నాప్‌..

News

Posted on 2026-04-14 15:58:05

Share: Share


డబ్బు కోసం క్లాస్‌మేట్‌ కిడ్నాప్‌..

బెంగళూరులో నలుగురు విద్యార్థుల అరెస్టు

డైలీ భారత్, బెంగళూరు: వారంతా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు. అంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వయసువారే. విలాసాలకు అలవాటు పడిన వీరు డబ్బు కోసం క్లాస్‌మేట్‌నే కిడ్నాప్‌ చేశారు. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ విద్యార్థి కిడ్నాప్‌ వ్యవహారాన్ని మడివాళ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆగ్నేయ విభాగ డీసీపీ ముహమ్మద్‌ సుజీత సోమవారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని ఓ కళాశాలలో చదువుతున్న ఆదిత్యభోస్లే, శౌర్య అగర్వాల్‌, నిక్కు సుల్తాని, సయ్యద్‌ మొహమ్మద్‌ బిలాల్‌ విలాసాలకు అలవాటుపడ్డారు. నలుగురూ కూడబలుక్కుని తమ సహ విద్యార్థి మహంతిని కిడ్నాప్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేయాలని స్కెచ్‌ వేశారు. శనివారం రాత్రి హాస్టల్‌ వద్ద కారు సిద్ధం చేసుకున్నారు. మహంతి రాగానే అందు లో ఎక్కించుకుని కిడ్నాప్‌ చేశారు. ఓ గదిలో బంధించారు. రూ.50వేలిస్తే వదిలేస్తామన్నారు. ఆ విద్యార్థి.. తన మిత్రుడికి ఫోన్‌ చేసి రూ.10వేలు యూపీఐ ద్వారా జమ చేయించారు. డబ్బులు పంపిన మిత్రుడు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్‌ ట్రాకింగ్‌ ద్వారా వారున్న ప్రదేశాన్ని గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి నకిలీ మెటల్‌గన్‌, కారును స్వాధీనం చేసుకున్నారు.

Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >
Image 1

ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు

Posted On 2026-07-27 04:38:19

Readmore >
Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >