| Daily భారత్
Logo




ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

News

Posted on 2026-04-13 18:03:35

Share: Share


ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం..

అరైవ్ - అలైవ్ కార్యక్రమాన్ని 

ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి..

రోడ్డు భద్రత వాల్ పోస్టర్ ను అవిష్కరించిన జిల్లా కలెక్టర్ 

డైలీ భారత్, కరీంనగర్: ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ - అలైవ్ కార్యక్రమాన్ని  ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు.

సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోన్న అరైవ్ - అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ప్రతి ఒక్కరు సహకరించాలని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడప వద్దన్నారు. మొబైల్ ఫోన్ వినియోగం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. హెల్మెట్,  సీట్‌ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. టూ వీలర్ వాహనదారులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపవద్దని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని  తెలిపారు. పాదచారులు కూడా జాగ్రత్తగా రోడ్లు దాటాలని, నిర్దేశిత జీబ్రా క్రాసింగ్‌లను వినియోగించాలని చెప్పారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీన సుభాష్ నగర్ లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు ఆటో రిక్షా డ్రైవర్లకు మెడికల్ చెకప్ నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పిస్తారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ పురుషోత్తం, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీకాంత్ చక్రవర్తి ఎంవీఐ రవికుమార్ రక్షణ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ మెంబర్, ఎన్జీవో నీలం సంపత్ పాల్గొన్నారు.

Image 1

ఎస్సీ కమిషన్ అధికారాలకు సుప్రీంకోర్టు పరిమితి

Posted On 2026-07-30 05:25:04

Readmore >
Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >
Image 1

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:14:43

Readmore >
Image 1

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:08:30

Readmore >
Image 1

నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో అశ్వాపురంలో విస్తృత తనిఖీలు

Posted On 2026-07-29 16:07:12

Readmore >
Image 1

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్

Posted On 2026-07-29 08:54:06

Readmore >