| Daily భారత్
Logo




రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

News

Posted on 2026-04-13 17:38:28

Share: Share


రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు సుజాతనగర్ మండల పరిధిలో పలు వార్డు లలో , గ్రామపంచాయతీలలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టి రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించి, వాటిని కచ్చితంగా పాటించాలని, సురక్షిత ప్రయాణానికి సంబంధించిన ప్రతిజ్ఞను చేయించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎస్సై రమాదేవి మాట్లాడుతూ రోడ్డు భద్రత, సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించగలమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే, ఎక్కువ శాతం ప్రమాదాలు మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం,హెల్మెట్, సీటుబెల్ట్ వాడకంలో అలసత్వం వంటి కారణాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు అవగాహన అత్యంత అవసరమని భావించి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు.ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేసే వారితో పాటు వెనుక కూర్చునే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, వాహనం నడిపే సమయంలో సిట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలన్నారు.రక్షణాత్మక డ్రైవింగ్ దృష్టి పెట్టాలని, అప్రమత్తంగా, సురక్షితంగా ఉండటం చాల కీలకమని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఎస్సై M. రమాదేవి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాకేష్ , సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్, ANM లు, ఆశా వర్కర్లు, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

Image 1

కామన్‌వెల్త్ గేమ్స్‌ : భారత్‌ ఖాతాలో మరో మూడు పతకాలు

Posted On 2026-07-30 06:06:22

Readmore >
Image 1

విశాఖపట్నం : కోటి గాజులతో 89 అడుగుల వినాయకుడి విగ్రహం...

Posted On 2026-07-30 06:05:12

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్

Posted On 2026-07-30 05:57:41

Readmore >
Image 1

ఎస్సీ కమిషన్ అధికారాలకు సుప్రీంకోర్టు పరిమితి

Posted On 2026-07-30 05:25:04

Readmore >
Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >
Image 1

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:14:43

Readmore >