| Daily భారత్
Logo




ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

News

Posted on 2026-04-13 15:39:44

Share: Share


ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార కేసులో (Cr. No. 434/2024) నాంపల్లి XII అదనపు సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి టి. అనిత నిందితుడికి సహజ మరణం వరకు కఠిన కారాగార జీవితం (లైఫ్ ఇంప్రిజన్‌మెంట్) విధిస్తూ, భారీ జరిమానా కూడా విధించారు.

2024 మే 11న నమోదైన ఈ కేసులో బాధితురాలు కర్నూలు జిల్లా బాలికా విద్యాలయంలో 9వ తరగతి చదువుతోంది. సెలవుల సమయంలో ఇంటికి వచ్చిన ఆమె, మే 10న కడుపునొప్పితో అమీర్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

పోలీసుల దర్యాప్తులో, వారి ఇంటి ఎదురుగా నివసించే మడకారు శ్రీనివాసులు అనే వ్యక్తి, బాధితురాలు తన కుమారుడితో ఆడుకోవడానికి వచ్చిన సమయంలో లైంగిక దాడికి పాల్పడినట్లు, దాని ఫలితంగా ఆమె గర్భవతి అయినట్లు నిర్ధారణ అయ్యింది.

నిందితుడు: మడకారు శ్రీనివాసులు (26)

నివాసం: దాసరాం బస్తీ, బి.కె గూడ, హైదరాబాద్

స్వస్థలం: గుంతకల్, అనంతపురం

శిక్ష:

POCSO చట్టం సెక్షన్ 5(j)(ii)(l) r/w 6 ప్రకారం,

సహజ మరణం వరకు కఠిన కారాగార జీవిత ఖైదు

జరిమానా: ₹10,000/-

(చెల్లించకపోతే అదనంగా 6 నెలల సాధారణ జైలు శిక్ష)

పరిహారం:

బాధితురాలికి ₹10,00,000/- చెల్లించాలని కోర్టు ఆదేశం

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన అధికారులను ఎస్.ఆర్ నగర్ ఇన్‌స్పెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.

Image 1

తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీగా చేరికలు

Posted On 2026-07-30 13:04:08

Readmore >
Image 1

ప్రీవెంటివ్ పోలీసింగ్ వైపు కామారెడ్డి పోలీసుల అడుగులు

Posted On 2026-07-30 13:03:09

Readmore >
Image 1

వందేమాతరం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం... జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణ

Posted On 2026-07-30 12:57:14

Readmore >
Image 1

సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు

Posted On 2026-07-30 08:32:38

Readmore >
Image 1

కామన్‌వెల్త్ గేమ్స్‌ : భారత్‌ ఖాతాలో మరో మూడు పతకాలు

Posted On 2026-07-30 06:06:22

Readmore >
Image 1

విశాఖపట్నం : కోటి గాజులతో 89 అడుగుల వినాయకుడి విగ్రహం...

Posted On 2026-07-30 06:05:12

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్

Posted On 2026-07-30 05:57:41

Readmore >
Image 1

ఎస్సీ కమిషన్ అధికారాలకు సుప్రీంకోర్టు పరిమితి

Posted On 2026-07-30 05:25:04

Readmore >
Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >