| Daily భారత్
Logo




ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

News

Posted on 2026-04-13 15:44:12

Share: Share


ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న భిక్నూర్ పోలీసులు

మెరుపు వేగంతో స్పందించిన పోలీసులు: దోపిడీకి గురైన 5 తులాల బంగారం రికవరీ – నిందితుడు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

పథకం వేసిన నేరం అయినా… పోలీసుల దృష్టి నుంచి తప్పించుకోలేరు.

వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఏఎస్పీ  బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్ 

డైలీ భారత్, కామారెడ్డి: తేది 12.04.2026 రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో భిక్నూర్ గ్రామం గాజులపేట గల్లీలో ఒంటరిగా నివసిస్తున్న ఉప్పరి లచ్చవ్వ ఇంటిలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి, ఆమెపై రోకలి బండతో దాడి చేసి మెడలో ఉన్న బంగారు పూస్తేల తాడు మరియు గుండ్లను దోపిడీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భిక్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఏఎస్పీ చైతన్య రెడ్డి పర్యవేక్షణలో భిక్నూర్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలు మరియు అత్యాధునిక సాంకేతిక ఆధారాలను అత్యంత చాకచక్యంగా విశ్లేషించిన పోలీసులు, నేరం జరిగిన 24 గంటల లోపే నిందితుడుగజ్జ స్వామి (54)ని భిక్నూర్ చర్చ్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించగా, అతని వద్ద నుండి దోచుకున్న బంగారు ఆభరణాలు మరియు నేరానికి ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేసు వివరాల్లోకి వెళ్తే:

భిక్నూర్ గ్రామం గాజులపేట గల్లీకి చెందిన నిందితుడు గజ్జ స్వామి, అదే ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న ఉప్పరి లచ్చవ్వ కదలికలపై కొంతకాలంగా నిఘా పెట్టాడు. ఆమె ఒంటరిగా ఉండటం, పైగా ఒంటిపై బంగారం ధరించడాన్ని గమనించిన నిందితుడు, ఎలాగైనా ఆ సొత్తును దోచుకోవాలని పథకం రచించాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో, ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు నిందితుడు ముందుగానే సిద్ధం చేసుకున్న మాస్క్ మరియు క్యాప్ ధరించి బాధితురాలి ఇంటిలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లగానే ఎవరూ రాకుండా తలుపులు గడియపెట్టి, ఇంట్లో ఉన్న రోకలి బండతో బాధితురాలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె తీవ్ర భయాందోళనకు గురైన సమయంలో, ఆమె మెడలో ఉన్న సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను (పూస్తేల తాడు, గుండ్లు) బలవంతంగా లాక్కొని, బయట సిద్ధంగా ఉంచుకున్న తన బైక్‌పై వేగంగా పరారయ్యాడు. నిందితుడిని అరెస్ట్ చేసి, అనంతరం రిమాండ్‌కు తరలించడం జరిగింది.

నిందితుడి వివరాలు:

గజ్జ స్వామి (54 సం||), నివాసం: గాజులపేట గల్లీ, భిక్నూర్ గ్రామం.

స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు: 1. 40 గ్రాముల బంగారు పూస్తేల తాడు 2. 10 గ్రాముల బంగారు గుండ్లు 3. నేరానికి ఉపయోగించిన బైక్ 4. మొబైల్ ఫోన్ 5. రోకలి బండ మరియు మాస్క్, క్యాప్

అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ సంపత్ కుమార్, ఎస్‌ఐ అంజనేయులు మరియు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారని కామారెడ్డి ఏఎస్పీ  తెలిపారు.

Image 1

సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు

Posted On 2026-07-30 08:32:38

Readmore >
Image 1

కామన్‌వెల్త్ గేమ్స్‌ : భారత్‌ ఖాతాలో మరో మూడు పతకాలు

Posted On 2026-07-30 06:06:22

Readmore >
Image 1

విశాఖపట్నం : కోటి గాజులతో 89 అడుగుల వినాయకుడి విగ్రహం...

Posted On 2026-07-30 06:05:12

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్

Posted On 2026-07-30 05:57:41

Readmore >
Image 1

ఎస్సీ కమిషన్ అధికారాలకు సుప్రీంకోర్టు పరిమితి

Posted On 2026-07-30 05:25:04

Readmore >
Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >