| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

తీవ్ర విషాదం..... సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సినీ సంగీత సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన స్వరమాధురి, ప్రఖ్యాత నేపథ్య గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న ఆమె కొంతకాలంగా ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచారు. దేశ ప్రధాని మోదీతో సహా ప్రముఖులు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. ఆశా జీ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లోయర్ పరేల్‌లోని ఆమె స్వగృహంలో ఉంచుతారు. అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కడసారి నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆమె గళం మూగబోవడం భారతీయ సంగీత లోకానికి ఎన్నటికీ తీరని లోటు. వేలాది మధురమైన పాటలతో శ్రోతలను అలరించిన ఆశా భోంస్లే భౌతికంగా దూరమైనా తన పాటలతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు

Previous భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Next కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
ADVERTISEMENT