Posted on 2026-04-11 16:20:42
ఘన నివాళులర్పించిన ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, భారత సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ మరియు మహిళా సాధికారత కోసం చేసిన కృషి అపారమని కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతల నిర్మూలనకు ఆయన చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన పూలే, తన భార్య సావిత్రిబాయి పూలే గారిని విద్యావంతురాలిని చేసి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అని గుర్తు చేశారు.
చివరగా, పూలే కలలు గన్న వివక్ష లేని సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను కేవలం స్మరించుకోవడమే కాకుండా, వాటిని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే మనం ఆ మహనీయునికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని జ్యోతిరావు పూలే కి ఘనంగా నివాళులు అర్పించారు.
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >