| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ

మహాత్మా జ్యోతిబా పూలె  జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ

డైలీ భారత్, కామారెడ్డి: సామాజిక సంస్కర్త రచయిత సమాజంలో సమానత్వం మరియు న్యాయం కోసం పోరాడిన మహనీయుడు విద్యా ద్వారానే అన్ని సమస్యలను పరిష్కరించుకోగలరు అన్న ఆశయంతో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాఠశాల స్థాపించి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి న్యాయం కోసం పోరాడిన సత్యశోధకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ  జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా పక్షాన ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాన్ని జరుపుతూ ఆ మహనీయుని ఆలోచనలను ఆశయాలకు అనుగుణంగా పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో టిఎన్జిఎస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు సహాధ్యక్షులు చక్రధర్ జిల్లా కార్యవర్గ సభ్యు లు గణేష్ అర్బన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మరియు పవన్  దోమకొండ తాలూకా కార్యదర్శి రమేష్ ,నరేష్ మరియు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

Previous సింగర్ మంగ్లీపై కేసు నమోదు
Next అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
ADVERTISEMENT