Posted on 2026-04-11 07:32:54
డైలీ భారత్, హైదరాబాద్: తన దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మోసం చేసిందని, అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించిందని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు
దాదాపు 150 మందిని మోసం చేశారని, డ్రెక్టర్ వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు కూడా ఈ కుట్రలో భాగమని ఆరోపిస్తున్న బాధితుడు
తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు ఫిర్యాదు చేయడంతో, BNS 351(2), 352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ, వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
డైరెక్టర్ వేణు ఉడుగుల పేరు కూడా!
తెలుగు రాష్ట్రాల్లో తన జానపద, సినీ గీతాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రమైన ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు. పెట్టుబడుల పేరుతో మోసం చేయడమే కాకుండా బాధితుల తరపున ప్రశ్నించిన న్యాయవాదిని చంపేస్తామని బెదిరించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, "విరాటపర్వం" ఫేమ్ డైరెక్టర్ వేణు ఉడుగుల పేర్లు కూడా ఉండటం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొంతమందితో కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి సుమారు 100 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నెలలు గడుస్తున్నా బాధితులకు ఎలాంటి లాభాలు గానీ, కనీసం అసలు డబ్బు గానీ తిరిగి చెల్లించలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు.
బాధితుల తరపున రంగంలోకి దిగిన న్యాయవాది సుబ్బారావు, చెల్లించాల్సిన డబ్బుల గురించి మంగ్లీ బృందాన్ని నిలదీశారు. ఈ క్రమంలోనే తనకు తీవ్రమైన బెదిరింపులు ఎదురయ్యాయని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించారని తెలిపారు. "యాక్సిడెంట్ చేయించి చంపేస్తాం" అంటూ వారు తనను బెదిరించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయవాది సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు లభించడంతో మంగ్లీ, శివ, వేణు ఉడుగులతో పాటు మరికొందరిపై చీటింగ్, బెదిరింపుల కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వరుస అవకాశాలతో కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్న మంగ్లీపై ఇలాంటి క్రిమినల్ ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.
#mangli #singer mangli #panjagutta
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >