| Daily భారత్
Logo




సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

News

Posted on 2026-04-10 21:17:45

Share: Share


సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

డైలీ భారత్, వరంగల్: శివారు ప్రాంతాల్లోని సెల్ టవర్ల సంబంధించిన బ్యాటరీలను చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని ఐదుగురిని హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు సుమారు 1లక్ష 98వేల రూపాయల విలువ గల 144 సెల్ టవర్ బ్యాటరీలు, 2లక్షల 60వేల రూపాయల నగదు, రెండు ట్రాలీలు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితులందరు నల్గోండ జిల్లాకు చెందిన కొంపల్లి గణేష్ (27), బొంగరాల సుధాకర్ (30), తన్నీరు శివాజీ (26), బీమనబోయిన నరసింహ (31), గడగోజు సురేష్ (25)లు గుర్తించడం జరిగింది.

ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులకు పట్టుబడిన నిందితుల్లో ప్రధాన నిందితుడైన గణేష్ (డ్రైవర్) మిగితా మిగితా ఇద్దరు నిందితులైన  సుధాకర్, శివాజీలకు జనరేటర్ మరమ్మత్తులు, సెల్ టవర్ పనులకు పరిజ్ఞానం కలిగి వుండటంతో  ముఠాగా ఏర్పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే అలోచనతో సెల్ టవర్లపై పరిజ్ఞానం కలిగి వుండటంతో సెల్ టవర్లకు వినియోగించే బ్యాటరీల్లోని కొన్నింటి తప్పించడం ద్వారా సెల్ టవర్ పనతీరులో ఎలాంటి సమస్యలు రావని గుర్తించిన నిందితులు సెల్ టవర్ బ్యాటరీలను చోరీలు చేసేందుకుగా సిద్దపడి ఈ ముగ్గురు నిందితులు సెల్ టవర్‌లోని బ్యాటరీలను చోరీ చేసి మహరాష్ట్రలోని గచ్చిరోలి ప్రాంతంలో విక్రయించి వచ్చిన డబ్బుతో  ముగ్గురు నిందితులు జల్సాలు చేసేవారు. ఇదే సమయంలో రాత్రి సమయాల్లో చెరువుల్లో చేపలను చోరీలకు పాల్పడే మిగితా ముఠా సభ్యులు సైతం కలవడంతో, ఈ ముఠా సభ్యులు చేపలు చోరీలకు పాల్పడే సమయంలోనే బ్యాటరీలు చోరీ చేసేందుకు అనుకూలంగా వున్న సెల్ టవర్లను గుర్తించిన సెల్ టవర్లలోని బ్యాటరీలను చోరీలకు పాల్పడేవారు. అలాగే చెరువుల్లో చోరీ చేసిన చేపలను నల్గోండ లో తక్కువ ధర విక్రయించేవారు. ఈ తరహలో నిందితులు వరంగల్ కమిషనరేట్, యాదాద్రి,నల్గోండ, సూర్యపేట జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 13 సెల్ టవర్ బ్యాటరీ చోరీలకు పాల్పడ్డారు. గత నెల మార్చ్ 3వ తారీకున హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ ప్రాంతంలోని సెల్ టవర్ నుండి 48 బ్యాటరీలకు చోరీకు గురికావడంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హసన్‌పర్తి పోలీసులు సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాపు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని ముఠా సభ్యులను గుర్తించిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. పక్కా సమచారంతో ఈ రోజు తెల్లవారుజామున నిందితులు చోరీ సొత్తును అమ్మేందుకు హసన్‌పర్తి మండలం, దేవన్నపేట గ్రామ శివారు ప్రాంతంలోని అవుటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద వేచి వున్న ముఠాలోని ఐదుగురు సభ్యులను హసన్ పర్తి పోలీసులు అరెస్టు చేసారు. నిందితులు ఇచ్చిన సమచారంతో పోలీసులు చోరీ సోత్తు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత, కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి, హసన్‌పర్తి ఇన్స్‌స్పెక్టర్ చేరాలు, యస్ ఐ లు దేవేందర్, సుజిత్ రెడ్డి, కానిస్టేబుళ్ళు క్రాంతి కుమార్, బావు సింగ్, వెంకట స్వామి, భరత్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

Image 1

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Posted On 2026-05-31 18:00:17

Readmore >
Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >
Image 1

మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-30 22:23:35

Readmore >
Image 1

అమ్మ చరణధూళి బిడ్డలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-30 17:58:19

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-05-30 17:55:56

Readmore >
Image 1

మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం

Posted On 2026-05-30 17:52:53

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం

Posted On 2026-05-30 17:17:48

Readmore >