మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించిన మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ఎస్సీ,ఎస్టీ సింగరేణి ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీసు లో సమావేశమైన మాలమహానాడు నాయకులు ఈ నెల 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భద్రాచలంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి.పాల్ రాజ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ మాట్లాడుతూ ఈనెల 14న ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో భద్రాచలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి. పాల్రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు ఎర్రమల. రాములు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు అన్నదాన కార్యక్రమం మరియు వస్త్ర దాన కార్యక్రమాలు నిర్వహించబడనని కావున జిల్లాలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ఆశేష జనవాహిని పాల్గొనిఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు పగిడిపల్లి. శ్రీకాంత్, పి.ఎన్. మూర్తి,సొల్లు.రవికిరణ్, వాడపల్లి.రమేష్, బూరుగు.సతీష్, గంధం. కల్పన, రౌతు.నిరంజన్, కార్తీక్ తదితర మాల మహానాడు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.