డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో పిఆర్టియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో నిరంతరం ఉపాధ్యాయుల శ్రేయస్సు కాంక్షించే సంఘం పిఆర్టియు తెలంగాణ అని. సంఘం బలోపేతానికి అందరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, రాష్ట్ర మరియు జిల్లా బాధ్యులు గిరి, శ్రీధర్ రావు, నరసింహారెడ్డి, సురేందర్, రాము, ఎల్లాగౌడ్ ,మారుతి తదితరులు పాల్గొన్నారు.
News
ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు