సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దురులో మీకోసం కార్యక్రమానికి హాజరైన ప్రజలకు గంజాయి , రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్స్ , మహిళా చట్టాలు, షీ టీమ్, నూతన చట్టాలపై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే 1930 నంబర్ కి పిర్యాదు చేయాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సీసీ కెమెరాల వలన ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటుకు సహకరించలని ప్రజలను కోరారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు. అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు, లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని తెలిపారు.