| Daily భారత్
Logo




లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీన్

News

Posted on 2026-04-07 19:50:46

Share: Share


లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీన్

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. ఇప్పటికే పలువురు అధికారులు అవినీతి నిరోధక శాఖ ట్రాప్‌లలో చిక్కుకుని జైలుపాలైన ఘటనలు జరుగుతూనే ఉన్నప్పటికీ, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం లంచాల డిమాండ్‌ను ఆపడం లేదు. పని జరగాలంటే తప్పనిసరిగా లంచం ఇవ్వాలని బాధితులపై ఒత్తిడి తెస్తూ, ఇవ్వకపోతే ఫైళ్లు కదలవని స్పష్టంగా చెప్పే పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి అవినీతి  పరులపై తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో  కఠిన చర్యలు తీసుకుంటోంది.

తాజాగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్ ఏసీబీ ట్రాప్‌లో చిక్కి అరెస్టయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో విత్తన లైసెన్స్ మంజూరు చేయాలని ఓ బాధితుడు అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్ వద్దకు వచ్చాడు. లక్షన్నర రూపాయలు లంచంగా ఇస్తే కానీ పని జరగదని గోవర్ధన్ నిక్కచ్చిగా చెప్పాడు. అందుకు బాధితుడు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే  భాగంగా ముందుగా రూ.25 వేల లంచం ఇచ్చాడు. ఇంకా లక్ష రూపాయలు ఇచ్చేముందు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 

దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ సిటీ రేంజ్–II యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈరోజు బాధితుడు దగ్గర్నుండి  రూ.1 లక్ష లంచం తీసుకుంటుండ గా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. . ట్రాప్ అనంతరం నిర్వహించిన రసాయన పరీక్షలో డాక్టర్ గోవర్ధన్ చేతివేళ్లు పాజిటివ్‌గా తేలినట్లు అధికా రులు వెల్లడించారు. అరెస్టు చేసిన అనంతరం నిందితుడిని నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఎక్కడైనా అవినీతి ఎదురైతే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >