| Daily భారత్
Logo




గ్రామ సభలతోనే ఐదేళ్ల కాలం వెళ్లదీస్తారా..?

News

Posted on 2026-04-03 05:31:40

Share: Share


గ్రామ సభలతోనే ఐదేళ్ల కాలం వెళ్లదీస్తారా..?

ప్రజల నుంచి ఎన్నిసార్లు దరఖాస్తులు స్వీకరిస్తారు

సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని ప్రజలు కోల్పోయారు: కాపు సీతాలక్ష్మి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం మాని గ్రామ సభల పేరుతో కాలయాపన చేస్తోందని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఫైరయ్యారు. గ్రామ సభలతోనే ఐదేళ్ల కాలం వెళ్లదీసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటికి మూడుసార్లు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించారని తెలిపారు. స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన గ్రామసభల్లో తిరిగి ప్రజల నుంచి దరఖాస్తులు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో స్వీకరించిన దరఖాస్తులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత జవాబుదారీగా ఉండాలని తెలియదా అని అడిగారు. గ్రామసభ నిర్వహించిన ప్రతిసారి పథకం కావాలంటే అప్లై చేసుకోవాలని చెప్పడంతో ఈ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయినట్లే అని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచనలు చేశారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >