| Daily భారత్
Logo




గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు

News

Posted on 2026-04-02 16:47:44

Share: Share


గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు

డైలీ భారత్, అనకాపల్లి (చీడికాడ): ​చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన భారీ గంజాయి రవాణా కేసులో చోడవరంలోని 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎం.హరి నారాయణ ఈరోజు కీలక తీర్పును వెల్లడించారు. నేరం నిరూపితమైన ముగ్గురు నిందితులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి రూ.1,00,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

​గత 13.10.2016న చీడికాడ మండలం, అప్పలరాజుపురం సమీపంలోని త్రిషింగ్ ఫ్లోర్స్, చేపలచెరువు వద్ద సుమారు 300 కిలోల గంజాయిని అక్రమంగా నిల్వ ఉంచి, తరలించేందుకు సిద్ధంగా ఉన్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి పది ప్లాస్టిక్ బస్తాలలో తరలిస్తుండగా, అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై జి.అప్పారావు మరియు వారి సిబ్బంది దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

శిక్ష పడిన నిందితుల వివరాలు: 

​కోర్టు ద్వారా శిక్ష ఖరారైన నిందితులు (అందరూ చీడికాడ మండలం, బైలపూడి గ్రామానికి చెందినవారు):

బొట్టా ఈశ్వరరావు (A-1), తండ్రి: పైడిబాబు.

గోకాడ తాతబాబు (A-5), తండ్రి: సన్నీ బాబు.

గోకాడ చెల్లు బాబు (A-6), తండ్రి: కుల్లు బాబు.

​వీరిపై NDPS చట్టంలోని సెక్షన్ 20(b)(ii)(C) r/w 8(c) కింద నేరం రుజువు కావడంతో, గౌరవ న్యాయమూర్తి గారు శిక్షను ఖరారు చేశారు. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో నిందితులు అదనంగా మరో 2 ఏళ్ల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

​ఈ కేసులో ప్రాసెక్యూషన్ తరపున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాస్క్యూటర్ చీపురుపల్లి సూర్యనారాయణ ని, పకడ్బందీగా దర్యాప్తు చేసిన నాటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై జి.అప్పారావుని  కోర్టు మానిటరింగ్ సెల్ మరియు చీడికాడ పోలీస్ సిబ్బందిని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

​మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసుల కృషిని, న్యాయస్థానం వెలువరించిన ఈ కఠిన తీర్పును ఎస్పీ స్వాగతించారు.


#AndhraPradeshStatePolice

#anakapallidistrict #anakapallipolice

#Andhra Pradesh Police

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >