| Daily భారత్
Logo




సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-03-25 15:10:49

Share: Share


సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

ధర్మారం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల(బీఆర్సీ) తయారీ కేంద్రం ప్రారంభం.

డైలీ భారత్, కోనరావుపేట: రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం ధర్మారంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో కషాయాలు, సేంద్రియ ఎరువు అలాగే తయారీ విధానం పశువుల పెంపకం ఇతర అంశాలను కలెక్టర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. జిల్లాకు 9 బయో ఇన్ ఫుట్ రిసోర్స్ సెంటర్(బీఆర్సీ)సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు తయారీ కేంద్రాలు) మంజూరు చేసిందని వెల్లడించారు. ఒక్కో కేంద్రానికి లక్ష రూపాయలు అందజేసిందని తెలిపారు. ఆయా కేంద్రాల్లో సేంద్రియ ఎరువులు, కషాయాలు ఆవు పేడ ఇతర పదార్థాలతో సిద్ధం చేసిన వాటిని రైతులు సాగులో వినియోగించుకునేందుకు తోడ్పాటు అందించేందుకు ఈ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు  రైతులు తమ పరిధిలోని సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తి తయారీ కేంద్రాలు సందర్శించి సాగులో ఆయా ఉత్పత్తులను వినియోగించాలని సూచించారు. రైతులకు వ్యవసాయ శాఖ ఆర్థికంగా భరోసా ఇస్తుందని తెలిపారు. దీంతో నేలకు పర్యావరణానికి ఎంతో మేలు అని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >