| Daily భారత్
Logo




బ్లూ డ్రమ్ భయం…ప్రాణాల కోసం భార్యను ప్రియుడితో పంపించిన భర్త!

News

Posted on 2026-03-20 03:23:58

Share: Share


బ్లూ డ్రమ్ భయం…ప్రాణాల కోసం భార్యను ప్రియుడితో పంపించిన భర్త!

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఉత్తర ప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. మీరట్‌లో జరిగిన “బ్లూ డ్రమ్ హత్య కేసు” తరహాలోనే మరో ఘటన జరగబోతుందనే అనుమానం భర్తలో భయాన్ని రేకెత్తించింది. చివరకు తన ప్రాణాల కోసం భార్యను ఆమె ప్రియుడితోనే పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.పోలీసుల వివరాల ప్రకారం.. బులందేశ్వర్‌కు చెందిన రాజ్‌కుమార్ భార్యకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. గతంలో పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి, తన ఆరు నెలల చిన్నారిని భర్త దగ్గర వదిలి, ప్రియుడితో నెలరోజులు గడిపింది. ఈ ఘటనతో అనుమానం పెరిగిన రాజ్‌కుమార్ పలుమార్లు ప్రశ్నించినా, ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది.ఒకరోజు ఆమె ఫోన్‌ను చెక్ చేసిన రాజ్‌కుమార్‌కు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో నగ్న చిత్రాలతో పాటు “సిమెంట్, డ్రమ్ స్టోరీ” పేరుతో హత్యలకు సంబంధించిన కథనాలు షేర్ చేయడం గమనించాడు. ఈ విషయాలు చూసి తనను కూడా అదే విధంగా హత్య చేసే ప్లాన్ ఉందేమోనని రాజ్‌కుమార్ తీవ్ర భయానికి గురయ్యాడు.తక్షణమే పోలీసులను ఆశ్రయించిన రాజ్‌కుమార్, జరిగిన విషయాన్ని వివరించాడు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన పంచాయతీలో ఆ మహిళ తన భర్తతో ఉండనని, ప్రియుడితోనే వెళ్లాలని స్పష్టం చేసింది. పరిస్థితిని అర్థం చేసుకున్న రాజ్‌కుమార్ చివరకు భార్యను ఆమె ప్రియుడితో పంపించేందుకు అంగీకరించాడు.ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసుల ప్రభావం ప్రజల్లో ఎంతటి భయాన్ని కలిగించిందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.

Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >