| Daily భారత్
Logo




కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ తనిఖీలు

News

Posted on 2026-03-16 16:34:54

Share: Share


కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ తనిఖీలు

అధికారుల, సిబ్బంది విధుల నిర్లక్ష్యం 

మున్సిపల్ ఆదాయానికి కోట్లలో గండి 

పెండింగులో ఇళ్ల పర్మిషన్ల దరఖాస్తులు 

169 పర్మిషన్ల కోసం దరఖాస్తులు కేవలం 18 దరఖాస్తుల  క్లియరెన్స్ 

గడువు దాటిన పర్మిషన్ ఇయ్యని అధికారులు 

 సిబ్బంది గైరాజరైన వేతనాలు మొత్తం డ్రా చేసిన అధికారులు 

ఈ అవినీతి బాగోతంలో తలపాపం తిల పిడికెడు అనే సామెత లాగా అందరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు 

మున్సిపల్ అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు నివేదిక 

తదుపరి చర్యలకు రంగం సిద్ధం 

10 గంటల పాటు నిరంతరం సోదాలు చేపట్టిన ఎసిబి అధికారులు 

మున్సిపల్ అధికారుల సిబ్బంది నిర్లక్ష్యం అవినీతి గుట్టును రట్టు చేసిన ఎసిబి అధికారులు

ప్రభుత్వానికి నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ అధికారులపై నివేదిక 

డైలీ భారత్, కామారెడ్డి:  అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారిన కామారెడ్డి మున్సిపల్ అధికారుల తీరుపై బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పూర్తి ఆధారాలతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో సోమవారం ఏసీబీ అధికారులు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో దాడులు నిర్వహించి సోదాలు చేపట్టారు. ఏసీబీ అధికారులు రికార్డులను పరిశీలించగా విధులలో కావాలని నిర్లక్ష్యం వహించినట్లు వెల్లడైంది. అధికారుల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మున్సిపల్ ఆదాయానికి కోట్ల రూపాయల గండి పడింది. 2025 _2026 సంవత్సరంలో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లు, భవన  నిర్మాణాలు చేపట్టారని 47 దరఖాస్తులు మున్సిపల్ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 47 భవనాలు అపార్ట్మెంట్ లతో కలిపి నిర్మించిన అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని  47 ఫిర్యాదులు వచ్చిన పట్టించుకోకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా భవనాలను నిర్మించారు. 400 కమర్షియల్ దుకాణాల వారు టాక్స్ చెల్లించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల కోటి రూపాయల కు పైగా ఆదాయం మున్సిపల్ కు గండి పడింది. అధికారులు, సిబ్బంది మామూళ్లకు కక్కుర్తి పడి మున్సి పల్ కార్యాలయానికి రావలసిన కమర్షియల్ దుకాణాల ఆదాయం గండి పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పన్ను ల అసెస్మెంట్లో సైతం అధికారులు సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో మునిసిపలాదాయానికి గండి పడింది. దుకాణదారులు, భవన  యజమాను లకు టాక్స్ తక్కువ చేస్తామని వారి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఎసిబి అధికారుల విచారణలో వెల్లడైంది. 12 లక్షల నలభై వేల రూపాయల ఫ్యూయల్ ఖర్చులు కు సంబంధించిన రికార్డులు లేవు. ఆ డబ్బులు మాత్రం డ్రా చేసి వాడేసుకున్నారు. ఏలాంటి రికార్డులు, వాటికి సంబంధించిన రిసిప్టులు లేకుండా బిల్లు డ్రా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మున్సిపల్ లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులకు గైరాజర్ అయినా కూడా వారి వేతనాలు పూర్తిస్థాయిలో డ్రా చేశారు. డిసెంబర్ 2025 వరకు భవన నిర్మాణాల పర్మిషన్ కోసం 169 మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని వివరాలతో దరఖాస్తు చేసిన వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారు. కేవలం 18 దరఖాస్తులకు సంబంధించిన వాటి నీ మాత్రమే పరిశీలించారు. 25 రోజుల గడువు ముగిసిన కూడా ఫీల్డ్ విజిట్ చేయకుండా పర్మిషన్ దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సూపర్వైజర్లు, ఇబ్బంది నిర్లక్ష్యంతో పాటు కమిషనర్ పర్యవేక్షణ లోపం వల్లే పెద్ద మొత్తంలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటన్నిటిని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, మునిసిపల్ కార్యా లయానికి వచ్చే ఆదాయాన్ని రాకుండా నిర్లక్ష్యం చేసినందుకు ప్రభుత్వానికి మునిసిపల్ అధికారుల పై సిబ్బందిపై నివేదిక అందిస్తామని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఫిర్యాదుదారులు డబ్బులు ఇచ్చామని టౌన్ ప్లానింగ్ అధికారులపై సిబ్బందిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. బిల్లుల చెల్లింపుల్లో కూడా అవకతవకలు జరిస్తారని నాణ్యత లేకుండా నిర్మించిన వాటికి బిల్లులు చెల్లించి పర్సంటేజీలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని ఏసీబీ అధికారులు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టినట్లు నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్ర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అధికారులు అక్రమాలకు పాల్పడితే టోల్ ఫ్రీ కి ఫోన్ చేయాలి

ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 10 64 ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారుల వాట్స్అప్ నెంబర్ 944 044 6106 ను సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. పనుల కోసం డబ్బులు డిమాండ్ చేసే అధికారుల వివరాలను ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ కు కానీ వాట్సప్ నెంబర్కు గాని వివరాలు తెలిపినచో విచారణ జరిపి దాడులు నిర్వహిస్తామన్నారు.  ఏ సి బి అధికారులకు ప్రజలు సమాచారం అందించి సహకరించాలని సూచించారు.

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >