Posted on 2026-03-16 16:04:27
చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కి ఫిర్యాదు
కొత్తగూడెం ఇమంది ఉదయ్ కుమార్.
డైలీ భారత్, భద్రాద్రి, కొత్తగూడెం: కొత్తగూడెం మరియు పాల్వంచ కార్పొరేషన్ పరిధిలో ఇష్టానుసారం ప్రభుత్వ ఆదేశాలను బేకాతరు చేస్తూ
రోడ్ల పక్కన ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ వేసిన అక్రమ హోర్డింగ్ లను ప్రకటన బోర్డులను వెంటనే తొలగించాలని ప్రజల ప్రాణాలకు ఇబ్బంది హాని జరగకుండా చూడాలని కొత్తగూడెం కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇమంది ఉదయ్ కుమార్ ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ను వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంటనే ప్రకటన బోర్డులను అన్నిటిని తొలగించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇమంది ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రకటన బోర్డులు పెట్టరాదని గతంలోనే 2020 జూలై 4వ తేదీన తెలంగాణ మున్సిపల్ శాఖ జీవోను జారీ చేసిందని తెలిపారు. ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రకటన బోర్డులకు అనుమతి ఇవ్వరాదని గతంలోనే ఇచ్చిన ప్రకటన బోర్డులకు అనుమతి పొడిగించరాదని స్పష్టంగా తెలిపారు.కానీ మున్సిపల్ అథారిటీ ఆదేశాలను తుంగలో తొక్కి ఇప్పటికే పాల్వంచలో దాదాపు మూడేళ్ల నుంచి బోర్డులకు అనధికార అనుమతులు ఇస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో సైతం ఎట్టి అనుమతులు లేకుండా బోర్డులు ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తూ మున్సిపల్ శాఖ నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారు. దీనిపై రెండు వారాల క్రితమే కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు లేకపోవడంతో మరల 16వ తేదీ సోమవారం నాడు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >