| Daily భారత్
Logo




రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ

News

Posted on 2026-03-12 12:59:36

Share: Share


రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ

శిక్షణ తరగతులకు హాజరైన చైర్మన్,వైస్ చైర్మన్ ,కౌన్సిలర్లు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా సర్పంచులు, మున్సిపల్‌ చైర్మన్‌, చైర్‌పర్సన్‌, వార్డు సభ్యులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పలకవర్గానికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్ తదితర కౌన్సిలర్లు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవు తాయని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే ఉటంకిస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ప్రజలకు ఏ విధంగానైతే ప్రామాణికమైన ఫలితాలు అందుతాయో, ఆ కోణంలో ఈ శిక్షణా కార్యక్రమం  ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ఉండాలన్నారు. ప్రత్యేక శిక్షణ తరగతులపై పాలకవర్గం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విశాల, జమాల్పూర్ సంతోషి బాయ్, నడికుడ శ్రావణి, ఎస్పీ శివ, సింగపగ శిరీష, ఒగ్గు జయలక్ష్మి, ఆరిఫా బేగం, గౌస్ జానీ, పెంటయ్య, రాజు నాయక్, పినమోని గోపాల్, పిల్లి శారద, సుధీర్, బచ్చలి నరేష్, మురళీమోహన్ అప్పి, ప్యాట అశోక్, కళ్యాణ్ కార్ దిలీప్, కొప్పునూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >