| Daily భారత్
Logo




దమ్మన్నపేట్ విద్యార్థులకు ఇన్నోవేషన్ ఎక్స్ ప్రెస్ అవార్డ్

News

Posted on 2026-03-08 14:21:10

Share: Share


దమ్మన్నపేట్ విద్యార్థులకు ఇన్నోవేషన్ ఎక్స్ ప్రెస్ అవార్డ్

డైలీ భారత్, దమ్మన్నపేట్: అగస్థ్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు కాగ్నిజెంట్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన “ఇన్నోవేషన్ ఎక్స్ప్రెస్” రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ZPHS దమ్మన్నపేట్ 8వ తరగతి విద్యార్థులు పొన్నాల లోహిత, కోల లాస్య ప్రియ లు, అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు.

ఈ కార్యక్రమం మార్చి 6, 7 తేదీలలో సికింద్రాబాద్‌లోని తెలంగాణ గార్డెన్ హాల్‌లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా 272 మంది విద్యార్థులు ఈ వైజ్ఞానిక ప్రదర్శన కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, అందులో నుంచి అత్యుత్తమ 65 ఆవిష్కరణలను ఎంపిక చేసి వారికి తుది పోటీని నిర్వహించారు.

ఈ పోటీలలో గైడ్ టీచర్ సంపత్ కుమార్ మార్గదర్శకత్వంలో పొన్నాల లోహిత, కోల లాస్యప్రియ విద్యార్థినులు రూపొందించిన “వంటమిత్ర” అనే వినూత్న ఆవిష్కరణతో అద్భుతమైన ప్రదర్శన చేసి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. విజేతలకు 10 వేల నగదు తో పాటుగా, జ్ఞాపిక ము అగస్థ్య ఫౌండేషన్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బలరాం, మరియు నటేష్ అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్థులు విద్యార్థులను అభినందించారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >