| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.

హెల్త్ క్యాంప్‌లో నిపుణుల సూచనలు

డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్‌లోని చేనేత సహకార సంఘంలోని కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్  మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ హెల్త్ క్యాంప్‌లో  డాక్టర్ విద్యాప్రకాశ్  పాల్గొని సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, షుగర్, బరువు, హీమోగ్లోబిన్, ఇ.సి.జీ. వంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు.

వైద్యులు కార్మికులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా నిపుణులు పలు సూచనలు చేశారు.

ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలనీ తెలిపారు.

పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందించాలన్నారు.

రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలనీ తెలిపారు.

సైకాలజిస్ట్ కె పున్నంచందర్ మాటాడుతూ

జీవన విధానంలో సానుకూల మార్పులు చేసుకోవాలనీ అన్నారు.

వ్యాయామం మరియు నడకను అలవాటు చేసుకోవాలనీ కోరారు.

మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇవ్వాలనీ తెలుపుతూ అవసరమైన సందర్భంలో మైండ్ కేర్ సెంటర్ ను సంప్రదించాలని కోరారు.

హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువల ఈశ్వర్ మాటాడుతూ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ సమాజ అభివృద్ధికి కీలకమని  పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువల ఈశ్వర్, సైకాలజిస్ట్ కె. పున్నం చందర్, అడ్వకేట్ దాసరి తిరుమల, ఆసుపత్రి సిబ్బంది లక్ష్మీరాజం, శ్రీకాంత్ , నర్సులు, సహకార సంఘం అధ్యక్షులు మూషం రాజయ్యా మరియు కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Previous జూబ్లీహిల్స్‌లోని షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం
Next బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ దయానంద్ కి జూలూరుపాడు పోలీస్ సిబ్బంది సన్మానం
ADVERTISEMENT