| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూబ్లీహిల్స్‌లోని షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్‌లోని షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షోరూమ్‌లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్న పడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలపు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముందుగా మంటలు షోరూమ్‌ బయట సెట్‌కి అంటుకున్నట్లు తెలుస్తోంది. మంటలు భారీగా చెలరేగడంతో పక్కనున్న షాపులకు కూడా అంటుకున్నాయి.

అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోగా, వెల్డింగ్‌ పనులు చేస్తుండగా, మంటలు అంటుకున్నట్లు సమాచారం. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అవుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మాల్‌ యజమాన్యం చెబుతుంది.

Previous మంజుల పత్తిపాటి.... జీవిత పరిచయం
Next హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ADVERTISEMENT