| Daily భారత్
Logo




జనగామ గ్రామ కరాటే పిల్లల సౌకర్యానికి 1 లక్ష రూపాయల విరాళం అందించిన సుభాష్ రెడ్డి

News

Posted on 2026-02-26 03:16:41

Share: Share


జనగామ గ్రామ కరాటే పిల్లల సౌకర్యానికి  1 లక్ష రూపాయల విరాళం అందించిన సుభాష్ రెడ్డి

కరాటే మాస్టర్ కు, పిల్లలకు అందించిన జనగామ గ్రామస్తులు 

డైలీ భారత్, జనగామ: జనగామ గ్రామం నుండి కరాటే నేర్చుకుంటున్న పిల్లలు జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటుతూ మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి  మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. పిల్లలు ప్రతి సారి విజయం సాధించినప్పుడు శాలువాలతో సత్కరించి, ప్రోత్సాహకాలు అందిస్తూ ఉత్తేజపరుస్తూ వస్తున్న సుభాష్ రెడ్డి నీ కరాటే మాస్టర్ పిల్లలకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు మ్యాట్లు కావాలని ఇతర వస్తువులు కావాలని కోరగా త్వరలోనే ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం బుధవారం కరాటే శిక్షణకు అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలుకు  ఒక లక్ష రూపాయలు ( 1,00,000) లను సర్పంచ్ ఆధ్వర్యంలో అందజేశారు.

కరాటే మ్యాట్స్, కిక్కింగ్ బ్యాట్స్, పంచింగ్ బ్యాగ్స్, నుంచక్స్, కిక్కింగ్ షీల్డ్స్, గ్లౌజెస్, షిన్ గార్డ్స్, కిక్కింగ్ డమ్మీ వంటి పరికరాలు లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఈ సహాయం అందించడం జరిగిందని గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ తెలిపారు. ఈ పరికరాలు అందుబాటులో ఉంటే జనగామ గ్రామ పిల్లలు ఇంకా ముందుకు వెళ్లి మరెన్నో విజయాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన పుట్టిన ఊరుకు ఎవరో ఎవరు చేయలేని విధంగా సహాయం చేస్తూ గ్రామస్తులను ప్రోత్సహిస్తున్న సుభాష్ రెడ్డికి గ్రామస్తులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ గ్రామ  ఉప సర్పంచ్ పాత స్వామి, బిబిపేట్ మండల మాజీ ఎంపీపీ కప్పెర రవీందర్ రెడ్డి , జాతీయ మానవ హక్కుల కమిషన్ బిబిపేట అధ్యక్షుడు బోదాసు సాయికుమార్ , చింతల రవి, బానాపూర్ స్వామి, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించి జనగామ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >