| Daily భారత్
Logo




కూరగాయలు పశువుల సంతను (అంగడి) ప్రారంభించిన సర్పంచ్

News

Posted on 2026-02-20 13:44:45

Share: Share


కూరగాయలు పశువుల సంతను (అంగడి) ప్రారంభించిన సర్పంచ్

రిబ్బన్ కట్ చేసి అంగడిని వైభవంగా ప్రారంభించిన ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్

భారీగా హాజరైన గ్రామ ప్రజలు,పెద్దలు,పలు రకాల వ్యాపారస్తులు.

అంగడితో కొత్త ధనాన్ని సంతరించుకున్న ఖానాపురం గ్రామ వీధులు..

కూరగాయల సంతకు కేవలం 10 రూపాయలు, పశువులకు 35 రూపాయలు మాత్రమే.

వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం

గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామానికి ఆర్థిక వనరులు సమకూర్చడమే లక్ష్యం..

ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సర్పంచ్ దాసరి రమేష్...

డైలీ భారత్, నర్సంపేట /ఖానాపురం :గ్రామ అభివృద్ధి లక్ష్యంగా, గ్రామానికి ఆర్థిక వనరులు సమకూర్చాలని  సంకల్పంతో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అంగడిని  శుక్రవారం  సర్పంచ్ దాసరి రమేష్ పాలకవర్గం గ్రామ ప్రజల సమక్షంలో రిబ్బన్  కత్తిరించి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

గ్రామ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నేడు అంగడిని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం  ఖానాపురం మండల కేంద్రంగా నిర్వహించే వారపు సంతలో కూరగాయలు చిరు వ్యాపారులకు కేవలం 10 రూపాయలు, పశువులకు 30 రూపాయలు (అంగడి చిట్టి)రహదారితో అంగడిని ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ అంగడిని ఖానాపురం పరిసర ప్రాంత ప్రజలు, నర్సంపేట నియోజకవర్గం ప్రజలు వ్యాపారులు చిరు వ్యాపారులు,బేరం చేసే వ్యక్తులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అంగడి నిర్వహణ మొత్తం ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు చూసుకుంటారని తెలిపారు.

ఖానాపురం చుట్టుప్రక్కల పల్లెలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యాపారం సమృద్ధిగా నడుస్తుందని దీనిని వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఉప్పు రాజు నిర్వాణ కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట ప్రసాద్ రావు, గుండ్లపల్లి విజయ్, చలికంటి మల్లికార్జున్ సభ్యులు కందుల రమాదేవి కామిశెట్టి లక్ష్మి శాఖమూరి ముఖేష్ చౌదరి భూక్య స్రవంతి ఈలపొంగు కొమరమ్మ తోటకూరి సంధ్య గుండ్లపల్లి మంజుల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మాజీ సర్పంచులు పరుచూరి సుబ్బారావు తక్కలపల్లి రమేష్ మాజీ ఎంపీటీసీలు బోడ పూలు నాయక్, మాజీ ఉపసర్పంచ్ మేడిద కుమార్ పెద్ద ఎత్తున గ్రామస్తులు, వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >