| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఐ ఏ ఎల్ ఆధ్వర్యంలో పురుగుమందుల వాడకంపై అవగాహన సదస్సు

ఐ ఏ ఎల్ ఆధ్వర్యంలో పురుగుమందుల వాడకంపై అవగాహన సదస్సు

నర్సంపేట /నల్లబెల్లి డైలీ భారత్: నల్లబెల్లి మండల కేంద్రంలోని పురుగుమందుల వాడకంపై ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట సీనియర్ సేల్స్ ఆఫీసర్ నాన్న బోయిన ఓదెలు మాట్లాడుతూ పంట పొలాల్లో రైతులు పురుగుమందులను వాడే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తూ రైతులు పురుగుమందులు ఆహార పదార్థాలతో కలిపి రవాణా చేయకూడదు. పిల్లలకు దూరంగా భద్రపరచవలెను. గాలి వీచే దిశగా పిచికారి చేయవలెను. పిచికారి చేసే సమయంలో ఆహార పదార్థాలు దూరంగా ఉంచవలెను. పిచికారి చేసిన పొలంలో హెచ్చరిక బోర్డులను నాటాలి. పురుగుమందుల డబ్బాలను ఏ విధమైన అవసరాలకు వాడకూడదు అని వివరించారు ఈ కార్యక్రమంలో నర్సంపేట సీనియర్ సేల్స్ ఆఫీసర్ ఓదేలు, శివకుమార్, జన్ను బిక్షపతి మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు

Previous టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య
Next స్కూల్లో మీ బిడ్డను కొడుతున్నారా? క్రమశిక్షణ పేరుతో హింసిస్తే టీచర్లపై కఠిన చర్యలు!
ADVERTISEMENT