| Daily భారత్
Logo




మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

News

Posted on 2026-02-10 19:41:28

Share: Share


మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మున్సిపాలిటీ ఎన్నికల విధుల పట్ల అధికారులు  బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్ మరియు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.మంగళవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి సంబంధించి శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన ఎలక్షన్ మెటీరియల్ పంపిణిని పరిశీలించారు.ఈ సందర్బంగా సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్ మాట్లాడుతూ పోలింగ్ విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ చెక్ లిస్ట్ ప్రకారం ఎన్నికల సామగ్రిని సరిచూసుకున్న తరువాతనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి బయలుదేరి వెళ్లాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ విధులు బాధ్యతగా నిర్వహించాలని అన్నారు. 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. గడువు లోపు పోలింగ్ కేంద్రం లోనికి చేరుకున్న ఓటర్లకు సాయంత్రం 5.00 గంటలు దాటిన తరువాత కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అంకితభావంతో కృషి చేయాలని ఎన్నికల సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఎక్కడ కూడా రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా పక్కాగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని, ఓటింగ్ సందర్భంగా గోప్యతను కాపాడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ మెటిరియల్ క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని సరిగా ఉన్నాయని నిర్దారణ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి బయలుదేరాలని సూచించారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, పోలింగ్ సిబ్బంది నిర్వహించే వారి విధులను క్షుణ్ణంగా వివరించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలని అన్నారు. శేరిగూడలో మండల్ పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. మహేశ్వరం డిసిపి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రత కల్పించడం జరుగుతుందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >