| Daily భారత్
Logo




బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య

News

Posted on 2026-02-10 11:18:09

Share: Share


బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య

మున్సిపల్ ఎన్నికల వేళ విషాదం..

బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య

డైలీ భారత్, ముక్తల్: ఎన్నికల ఖర్చులు, ఒత్తిడి తట్టుకోలేక మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసిన ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తెల్లవారుజామున నారాయణపేట జిల్లా మక్తల్‌లో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎస్టీలకు రిజర్వు కావడంతో ప్రధాన పార్టీలు ముగ్గురు సొంత అన్నదమ్ములనే రంగంలోకి దించాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ నుండి మహదేవ్ (43), కాంగ్రెస్ నుంచి అతడి అన్న పోటీలో ఉండగా.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారి తమ్ముడు నామినేషన్ ఉపసంహరణ రోజున పోటీ నుంచి తప్పుకున్నాడు. పోటీలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

అయితే, నిన్నటి నుంచి డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుండడంతో.. 6వ వార్డులోనూ పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులు కోరినట్లుగా సమాచారం. తాను లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలను.. మిగతాది తన వల్ల కాదని సోమవారం పార్టీ శ్రేణులకు ఆయన తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. మహదేవప్ప ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి కావడంతో ఆ వార్డులో ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది.

Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >