Posted on 2026-02-08 12:13:28
అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి
ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు
ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు.
సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్రచారి
డైలీ భారత్, సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా,స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేందకు చెక్‌పోస్టులు, వీడియో సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అక్రమ మద్యం కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై పోలీస్ నిఘా నిరంతరం ఉంటుందని తెలిపారు.
ఎవరైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించినా, డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
సోమవారం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా అమలు చేస్తున్నామని తెలిపారు.ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల నియమావళిని గౌరవించి శాంతియుత ఎన్నికలకు సహకరించాలని కోరారు.
ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తులు సోమవారం సాయంత్రం ఐదు గంటలలోపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తున్నాం.
సిరిసిల్ల ఓటర్లు ఉత్సాహంగా ముందుగానే పోలింగ్ స్టేషన్ చేరుకొని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >