| Daily భారత్
Logo




ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో 4వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా

News

Posted on 2026-02-08 16:08:38

Share: Share


ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో 4వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతిరెడ్డి పద్మ రాంరెడ్డి

డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో తనని గెలిపిస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తానని 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దొంతిరెడ్డి పద్మ రాంరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని 4వ వార్డులో గడపగడపకు తిరుగుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా పద్మ రాంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం ఉపాధి జరుగుతుందని అన్నారు.చేయి గుర్తుపై అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు తాను నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వార్డులో డ్రైనేజీ,సీసీ రోడ్లు, వీధిలైట్లు, మంచినీరు తదితర సమస్య లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రజల రక్షణ కోసం వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. బూత్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ప్రణాళికతో సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థులను మరియు పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర ప్రతాప్ రెడ్డి, దాసా నాగేశ్వర్రావు, ఆంజనేయులు, శివ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >