| Daily భారత్
Logo




సిరిసిల్ల : కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలకు డా. కుసుమ విట్టల్ రూ.10 లక్షల భారీ విరాళం

News

Posted on 2026-02-07 08:25:10

Share: Share


సిరిసిల్ల : కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలకు డా. కుసుమ విట్టల్ రూ.10 లక్షల భారీ విరాళం

డైలీ భారత్, సిరిసిల్ల: పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, కష్టసాధ్యమైన ప్రయాణం ద్వారా అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడ్డ డా. కుసుమ విట్టల్ మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.

తాను చదువుకున్న కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల, సిరిసిల్లకు రూ.10 లక్షల విరాళం అందజేసి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట వేశారు.

ఈ సహాయం 6వ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులందరికీ వారి విద్యా అవసరాలు, మౌలిక వసతులు, ప్రతిభాభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఈ విరాళం అందించడం విశేషం.

ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన మూలాలను మరవకుండా, తాను ఎదిగిన పాఠశాలకే తిరిగి చేయూతనివ్వడం ఆయన దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఈ విరాళం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, “మేము కూడా ఉన్నత స్థానాలకు చేరగలం” అనే ఆశను రగిలిస్తోంది.

డా. కుసుమ విట్టల్  సేవాభావానికి సిరిసిల్ల ప్రజల హృదయపూర్వక అభినందనలు 

విద్యే భవిష్యత్తు… సేవే నిజమైన సంపద.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, స్టాఫ్ సెక్రటరీ శంకర్ గౌడ్, కుసుమ శ్రీధర్, వేముల శ్రీనివాస్, భూమేష్, పురుషోత్తం  ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >