| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శీర్షిక : కళాకారులు

శీర్షిక :  కళాకారులు

డైలీ భారత్, స్పెషల్: 


శీర్షిక :  కళాకారులు

క్షణం క్షణం జారిపోతున్న ఇసుక రేణువులా

కనుమరుగై పోతున్నారు జానపద కళాకారులు

పల్లె జీవనం నుంచి పుట్టుకొచ్చిన జానపద కళలెన్నో 

ఆధునిక వినోద సాధనాల వల్ల ఆదరణ తగ్గి

కనుమరుగై పోతున్నారు జానపద కళాకారులు

జానెడు పొట్ట నింపుకోవడానికి 

పడరాని పాట్లు పడుతున్న

మోసం నేర్వని అమాయకులు

గుండెల్లో బాధలను దిగమింగుకుని

కట్టలు తెంచుకొని వస్తున్న కన్నీళ్లును

కనురెప్పల మాటున దాచుకొని

ప్రాచీన కళారూపాలను కాపాడుకుంటున్న

మోసం నేర్వని అమాయకులు

నా బిడ్డలకు శుభాకాంక్షలు, సన్మానాలు అక్కర్లేదు

బతుకు దెరువు చూపించండి చాలు

అంటుంది కళామ్మ తల్లి

ఓ పాలకుల్లారా అధికారుల్లారా

సంస్కృతి సాంప్రదాయాలకు వెన్నెముకైన

కళాకారుల బతుకులు చీకటి కమ్ముకుంటున్నాయి

వెలుగు జ్యోతి వెలిగించ మంటుంది కళామ్మ తల్లి


రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం.

చరవాణి 9347042218

Previous ప్రచారంలో దూసుకెళ్తున్న బీఎస్పీ అభ్యర్థి కురిమెల్ల శంకరయ్య
Next రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదంతోకాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధి గా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి : భూక్యా రామచంద్ర నాయక్
ADVERTISEMENT