Posted on 2026-02-05 03:35:57
బహుజన రాజ్యంతోనే పేదలకు న్యాయం, అభివృద్ధి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి కురిమెల్ల శంకరయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహుజన రాజ్య స్థాపన ద్వారానే పేదలు, అణగారిన వర్గాలకు నిజమైన న్యాయం, అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే అధికారంలోకి బహుజనులే రావాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు మౌలిక వసతుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
ముఖ్యంగా పేదలకు విద్య, వైద్యం, ఉపాధి, నివాసం వంటి మౌలిక హక్కులు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ, రహదారులు, తాగునీరు, వీధి దీపాల వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు.
బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు సంక్షేమ పథకాల అమలు పూర్తిస్థాయి పారదర్శకతతో జరుగుతుందని తెలిపారు. సమాజంలో మార్పు కోరుకునే ప్రజలు ఏనుగు గుర్తుపై ఓటు వేసి బహుజన అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >