Posted on 2026-02-04 15:45:22
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ సుజాతనగర్ మండలం కార్పొరేషన్ పరిధిలోని నాలుగు డివిజన్ లో కార్పొరేషన్ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులకు సుజాతనగర్ పోలీసు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవగాహన సదస్సులో చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ . రాయలవెంకటేశ్వర్లు, , సుజాతనగర్ తాసిల్దార్, సుజాతనగర్ ఎస్సై ఏం.రమాదేవి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచనలు తెలియజేయడం జరిగింది ఎన్నికల ప్రచారం కొరకు వాహనాలను మరియు మైకుల కు కచ్చితంగా మున్సిపల్ కమిషనర్ మరియు డిఎస్పీ పర్మిషన్ తీసుకోవాలి. పబ్లిక్ మీటింగ్లు ర్యాలీలు తీయడానికి పర్మిషన్ తీసుకోవాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగతమైన, కుటుంబాన్ని ఉద్దేశించి, వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా, పోస్టులు పెట్టే వారిపై, గ్రూపు అడ్మిన్ పై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ రోజుకి 48 గంటల ముందు ప్రచారం ఆపివేయాలి. 50 వేలకు మించి డబ్బు కలిగి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు కలిగి ఉండాలి లేనిచో అట్టి డబ్బులు సీజ్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ కు వంద మీటర్ల దూరంలో ఎటువంటి ప్రచారం గానీ, పార్టీ గుర్తులు గాని చూపించరాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలని పాటించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ సిబ్బంది సుజాతనగర్ మండల ప్రజలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >