| Daily భారత్
Logo




మున్సిపల్‌ ఎన్నికల్లో ముగిసిన కీలక ఘట్టం

News

Posted on 2026-02-03 16:36:42

Share: Share


మున్సిపల్‌ ఎన్నికల్లో ముగిసిన కీలక ఘట్టం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో కీలక సమావేశం ఘట్టం ముగిసింది. నామినేషన్లు ఉపసంహరణకు గడువు ముగిసింది. మంగళవారం సాయంత్రం 3 గంటల వరకూ ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు.మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సివస్తే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది.మెుత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈసీ అధికారులు తెలిపారు. పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత కల్పిస్తామన్నారు. రిటర్నింగ్ అధికారులకు సహకరించాలని పార్టీలను కోరారు. కాగా, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >