Posted on 2026-02-02 15:27:53
డైలీ భారత్, కామారెడ్డి: స్థానిక జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల హనుమాన్ మందిర్ (JBS) లో 1994-95 లో పదోతరగతి చదివిన వారంతా ఆదివారం కలుసుకున్నారు. పాతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి తమ ఉపాధ్యాయులు సత్యనారాయణ, మోహనరెడ్డి, వీరన్న, భాస్కర్ రావు, మంజుల మరియు అరుణ జ్యోతి టీచర్ లను ఘనంగా సత్కరించి, వారి ఆశీర్వదాలు తీసుకున్నారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ 31 ఏళ్ల క్రితం చదివినవారంతా ఇప్పుడు సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం భోజన కార్యక్రమం మరియు ఆట పాటలతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. JBS సిండికేట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సత్యనారాయణ, స్వామి, సంతోష్, నర్సింలు బట్టు, శైలజ, సరిత, విశాలి, రాణి, తదితరులు పాల్గొన్నారు.
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >