Posted on 2026-02-01 14:13:45
ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం : మంత్రి వెల్లుడి
అంత్యక్రియలో పాల్గొన్న మంత్రి జూపల్లి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రూ.కోటి ఎక్స్రేషియా, ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం, రిటైర్మెంట్ వరకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సౌమ్య స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో అంత్యక్రియలు నిర్వహించడంతో ఈ అంతక్రియల కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణా రావు, ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠీ, సీపీ సాయి చైతన్య హాజరై సౌమ్య మృతదేహానికి నివాళి అర్పించారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >