Posted on 2026-01-30 15:17:23
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లామున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల వద్ద విధులలో ఉన్న పోలీసు అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులునిర్వర్తించాలని,అభ్యర్థులు మరియు వారి అనుచరులుఈ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు.గుంపులు గుంపులుగారావడం,నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడతామని తెలియజేశారు.సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ,మెటల్ డిటెక్టర్లు,బారికేడ్లు,ట్రాఫిక్ నియంత్రణ వంటి భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసు వారికిగ్ సమాచారం అందించాలని కోరారు.జిల్లాలో శాంతియుత, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >