Posted on 2026-01-30 12:23:18
7 కోట్ల 96 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గంజాయిన దహనం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలోని 08 పోలీస్ స్టేషన్లలో నమోదైన 13 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 1592 కేజిల నిషేధిత గంజాయిని బుధవారం మరియు రెండు రోజుల పాటు తల్లాడ మండలం గోపాలపేట లోని బయో డిస్పోజల్ ప్లాంట్ పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ సుమారుగా 7 కోట్ల 96 లక్షల రూపాయలు ఉంటుంది.జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అయిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనలతో సభ్యులైన పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కోర్టు వారి అనుమతి తీసుకుని ఈ నిషేధిత గంజాయిని వరకు దశల వారీగా విభజించి దహనం చేయడం జరిగింది.NDPS యాక్ట్ లోని నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయిని దహనం చేయడం జరిగిందని ఎస్పీ తెలియజేసారు.కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని,ఈ విధంగా ఆసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా రహస్య బృందాల్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >