| Daily భారత్
Logo




వికాసం.. విశ్వాసం... సేవే లక్ష్యంగా మూడవ డివిజన్ ప్రజల ముందుకు వస్తున్నాం

News

Posted on 2026-01-30 10:11:09

Share: Share


వికాసం.. విశ్వాసం... సేవే లక్ష్యంగా మూడవ డివిజన్ ప్రజల ముందుకు వస్తున్నాం

ఆశీర్వదించండి అంటూ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ నామినేషన్ వేసిన బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి చింత ప్రసూన శ్రీనివాస్

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  సమాజ వికాసమే విశ్వాసం చేవె లక్ష్యంగా మూడవ డివిజన్ వాసుల కు సేవ చేయడానికి కార్పొరేటర్ గా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి అంటూ బిజెపి అభ్యర్థి చింతా ప్రసూన శ్రీనివాస్ శుక్రవారం గూపన్పల్లి లో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రంలో ఆమె నామినేషన్ వేశారు. డివిజన్ మొత్తం సాంప్రదాయ బద్దంగా మేళ బాజ తో డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ తమను ఆశీర్వదించాలంటూ చింత ప్రసూన శ్రీనివాస్ ప్రతి ఒక్కరికి తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఓ యువత మేలుకో చింత ప్రసూన శ్రీనివాస్ ని ఎన్నుకో ఇందూరుని ఏలుకో అనే నినాదంతో  తన ప్రచారాన్ని సాగిస్తూ నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి అధిష్టానం తనకు ఈసారి కచ్చితంగా బీఫామ్ అందిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాను గెలిచాక అమ్మ కానుక పథకం కింద అప్పుడే పుట్టిన ప్రతి ఆడబిడ్డ కి ఐదువేల ఒక వంద 16 రూపాయలు నగదును అందజేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అలాగే ప్రతి వీధిలో సీసీ కెమెరాల సదుపాయం, డ్రైనేజీ, రోడ్లు, నీటి సదుపాయం అందే విధంగా చూస్తానని అన్నారు. ముఖ్యంగా డివిజన్ వాసుల ఆశీర్వాదంతో తాను గెలిస్తే ప్రతి నెల డివిజన్ సమస్యలపై సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు అలాగే పార్కు డెవలప్మెంట్, అంబేద్కర్ భవన్, మహిళా సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందే విధంగా కృషి చేయడంతో పాటు పక్కా ఇల్లు, అర్హులకు లోన్ సదుపాయం, పారిశుద్ధ్యం పచ్చదనం తోపాటు హెల్త్ క్యాంప్ నిర్వహణ కచ్చితంగా నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు కావున డివిజన్ వాసులు ఈ ఒక్కసారి తనను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.


Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >