| Daily భారత్
Logo




ర‌హ‌దారి ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా

News

Posted on 2026-01-30 08:04:39

Share: Share


ర‌హ‌దారి ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా

ఊపిరి పీల్చుకున్న‌ శ‌బ‌రి హిల్స్ లే ఔట్ య‌జ‌మానులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : అబ్దుల్‌పూర్‌మెట్ మండ‌లం పెద్దంబ‌ర్‌పేట విలేజ్‌లో ఓ లే ఔట్‌లోకి చొర‌బ‌డి ర‌హ‌దారుల‌ను ఆక్ర‌మించేసి నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా గురువారం తొల‌గించింది. 265 స‌ర్వే నంబ‌రులో 278 ప్లాట్ల‌తో శ‌బ‌రిహిల్స్ పేరిట లే ఐట్ వేశారు. ఈ లే ఔట్‌కు ఆనుకుని 346 స‌ర్వే నంబ‌రులో ఎక‌రం భూమి కొన్న వ్య‌క్తి  లే ఔట్‌లోకి జ‌రిగి 20 ప్లాట్ల మేర ఆక్ర‌మించారు. త‌న స్థ‌లంలోంచి నాలా వెళ్తోంద‌ని చెబుతూ.. ఈ స్థ‌లం త‌న‌దంటూ ఆక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఆక్ర‌మ‌ణ‌తో త‌మ ప్లాట్ల‌తో పాటు.. లే ఔట్‌లోకి వెళ్లే దారి కూడా బంద్ అయ్యింద‌ని శ‌బ‌రి హిల్స్ లేఔట్ ప్లాట్ల య‌జ‌మానులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు మేర‌కు హైడ్రా విచార‌ణ చేప‌ట్టింది. ఇరుప‌క్షాల స‌మ‌క్షంలో ఏడీ స‌ర్వేతో హ‌ద్దుల‌ను నిర్ధారించింది. లే ఔట్‌లోకి 4 వేల గ‌జాల వవ‌ర‌కూ జ‌రిగిన‌ట్టు నిర్ధారించుకుని.. అందులోని ర‌హ‌దారుల‌కు ఆటంకంగా ఉన్న ప్ర‌హ‌రీల‌ను హైడ్రా గురువారం తొల‌గించింది. దీంతో శ‌బ‌రిహిల్స్ లే ఔట్ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >